హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై డీజిల్ ట్యాంకర్ పేలింది. నల్గొండ జిల్లా చిట్యాలో ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీపై ఉన్న డీజిల్ ట్యాంకర్ పేలిపోయింది. డ్రైవర్ లారీ నుంచి కిందకు దూకడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.