– 26 మంది దుర్మరణం
– ప్రైవేటు బొగ్గు గని కార్యాలయంలో చెలరేగిన మంటలు
ఇదేనిజం, నేషనల్ బ్యూరో: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. షాంగ్జీ ప్రావిన్స్‌లోని లియులాంగ్ నగరంలోని ఓ ఐదంతస్తుల భవనంలో ప్రైవేటు బొగ్గు గని ఉంది. గురువారం ఉదయం ఈ భవనంలోని మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు భవంతి మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మంది చిక్కుకుపోయారు. వీరిలో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రి తరలించాయి. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు స్థానిక అధికారులు తెలిపారు.