మహారాష్ట్రలోని నాగ్పూర్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమలేశ్వర్ తాలూకాలో ఇద్దరు అన్నదమ్ములు ట్రక్కు ఢీకొట్టడంతో మృతి చెందారు. ఈ ప్రమాదంలో వారి తలలు మొండాల నుంచి వేరయ్యాయని పోలీసులు తెలిపారు. అస్తికలా గ్రామానికి చెందిన మృతులు సందీప్ చంద్రభన్ కాండే(34), ప్రవీణ్(28)గా గుర్తించారు. డివైడర్లోని చిన్న ఓపెనింగ్ ద్వారా రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ వారిని ఢీకొట్టిందని పేర్కొన్నారు.