విదేశీ పర్యటన ముగించుకొని చంద్రబాబు నాయుడు స్వదేశానికి తిరిగొచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. దాదాపు పది రోజుల విదేశీ పర్యటన తర్వాత సీబీఎన్ తిరిగిరావడంతో అభిమానులు ఉత్సాహం ప్రదర్శించారు. సీఎం..సీఎం అంటూ నినాదాలు చేశారు. విశ్రాంతి కోసం చంద్రబాబు ఈ నెల 19 న విదేశాలకు వెళ్లారు. కాగా కౌంటింగ్ దగ్గర పడుతుండటంతో విదేశాలకు వెళ్లిన నాయకులు తిరిగి వస్తున్నారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.