మరికాసేపట్లో సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేసరపల్లిలో జరగనున్న ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు తరలివస్తున్నారు. సినీనటుడు చైతన్యకృష్ణ, సుహాసిని, బాలకృష్ణ సతీమణి వసుంధర, నిర్మాత ఆది శేషగిరిరావు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు. సభా వేదికపైకి వచ్చిన వారికి నందమూరి బాలకృష్ణ సాధర స్వాగతం పలికారు. ముగ్గురు హీరోలు కలిసి అభిమానులు, ప్రజలకు అభివాదం చేశారు. ప్రమాణస్వీకార వేదికపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. వేదికపైకి వచ్చి కాబోయే మంత్రులను పేరుపేరున పలకరించారు. అనంతరం ప్రజలకు అభివాదం చేశారు. ఆయన్ను చూడగానే పార్టీ శ్రేణులు సంతోషంతో కండువాలు ఊపుతూ కేరింతలు కొట్టారు.