Homeహైదరాబాద్latest Newsకొండంత నోటి దూల.. సభ్యత మరిచిన మహిళా మంత్రి

కొండంత నోటి దూల.. సభ్యత మరిచిన మహిళా మంత్రి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: మహిళా మంత్రి కొండా సురేఖ సభ్యత మరిచారు. తానో మంత్రిని అన్న విషయం మరిచిపోయి బజారు ఆరోపణలు చేశారు. ఆమె చేసిన నీచమైన ఆరోపణలతో తెలుగు సమాజమే కాదు.. యావత్ భారతదేశమే నివ్వెరపోయింది. కొండా సురేఖ తీరు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటువంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా కొనసాగుతున్నారా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. సభ్య సమాజం ఏమనుకుంటుందో అన్న ఇంగితం లేకుండా.. సంస్కారం మరిచి.. విలువలు పక్కకుపెట్టి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆమె చేసిన నీచమైన ఆరోపణలతో అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అక్కనేని కుటుంబమైతే ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. నాగార్జున సతీమణి అక్కినేని అమల కొండా సురేఖను ఓ రాక్షసిగా పోల్చారు. అగ్రనేత రాహుల్ గాంధీ వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

సురేఖ చేసిన ఆరోపణలు ఏంటి?
‘సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కేటీఆరే కారణం. ఎన్ కన్వెన్షన్ విషయంలో కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేసిండు. కేటీఆర్ చాలా మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడు. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టొద్దంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేసిండు. వెళ్లాలని నాగార్జున కూడా సమంతను ఫోర్స్ చేసిండు. సమంత ఒప్పుకోలేదు. అందుకే విడాకులు తీసుకున్నది. కేటీఆర్ కు భయపడి చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. చాలామందికి కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేసిండు. వాళ్ల జీవితాలతో ఆడుకున్నాడు’ అంటూ సురేఖ నోటికొచ్చినట్టు వాగారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సురేఖ తీరును మేధావులు, ప్రజలు అందరూ అసహ్యించుకున్నారు.

అంతటా చీత్కరింపులే..
కొండా సురేఖ తీరును అంతా అసహ్యించుకుంటున్నారు. ఓ మహిళా మంత్రి అయ్యి ఉండి ఇలాగేనా మాట్లాడేది అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రకాశ్ రాజ్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్ నాగేశ్వర్, గాయని చిన్మయి ఇంకా ఎందరో ప్రముఖుల కొండా తీరును తీవ్రంగా విమర్శించారు. నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రముఖ మహిళా నేతలు సైతం ఖండించారు.

మొదటి నుంచీ ఇదే తీరు
కొండా సురేఖ మొదటి నుంచీ ఇదే తీరు కనబరుస్తోంది. నోటికొచ్చినట్టు ఆరోపణలు చేయడం.. బూతులు మాట్లాడటం ఆమెకు అలవాటుగా మారాయి. అరెయ్, ఒరేయ్ అని మాట్లాడటం.. రౌడీ భాషను ఉపయోగించడం ఆమెకు వెరీ కామన్ అయిపోయింది. ఏ ఆధారం లేకుండా హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలపై కొండా సురేఖ చేసిన కామెంట్లను అంతా అసహ్యించుకుంటున్నారు. బతుకమ్మ పండగ వేళ ఏంటీ ఎవగింపు రాజకీయం అంటూ ప్రజలు చిదరించు కుంటున్నారు. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. అలా కాకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. అసలు ఇటువంటి ఆరోపణలు చేస్తున్న మంత్రి మీద కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

డైవర్షన్ కోసమేనా?
ప్రస్తుతం రాష్ట్రంలో మూసీ కూల్చివేతల అంశమే ప్రధానంగా కొనసాగుతోంది. మూసీ బాధితుల నుంచి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ అంశాన్ని బీఆర్ఎస్ అందిపుచ్చుకున్నది. అయితే టాపిక్ డైవర్షన్ కోసమే కొండా సురేఖ ఇటువంటి నీచమైన ఆరోపణలను ఎత్తుకున్నదని తెలుస్తోంది. అయితే సురేఖ చేసిన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ మైలేజీ తీసుకురాకపోగా నష్టం చేకూర్చాయి. సీన్ రివర్స్ అయింది. దిగజారి పోయింది కొండా సురేఖ ద్వారా కాంగ్రెస్ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది.

కేటీఆర్ లీగల్ నోటీసులు
కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తన గౌరవానికి భంగం కలిగించాలన్న లక్ష్యంగానే కొండా సురేఖ తనపై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారని మహిళా మంత్రికి పంపిన లీగల్ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకపోతే.. చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులు వేస్తానని మహిళా మంత్రిని కేటీఆర్ హెచ్చరించారు. తనకు ఏ సంబంధం లేదని ఫోన్ ట్యాపింగ్ తో పాటు నటీనటుల విడాకులకు తనకు లింక్ పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ఏ ఆధారాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్య పూరిత వ్యాఖ్యలు, దురుద్దేశ పూరిత మాటలు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచురితం అయ్యాయి. మంత్రి అయి ఉండి సాక్షాలు చూపించకుండా అడ్డగోలుగా మాట్లాడిన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ప్రజలు నిజాలుగా భ్రమపడే అవకాశం ఉందని ఆమెకు పంపిన లీగల్ నోటీసులలో కేటీఆర్ పేర్కొన్నారు.

తీవ్రంగా ఖండించిన నాగార్జున
రాజకీయాల కోసం తమ వ్యక్తిగత విషయాలను వాడుకోవడం సరికాదని మంత్రి కొండా సురేఖకు నటుడు నాగార్జున సూచించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. విడాకులు తన వ్యక్తిగత విషయం అని నటి సమంత సైతం స్పందించారు. తనను రాజకీయాల్లోకి లాగవద్దని, సినీ పరిశ్రమలో ఉన్నందుకు తాను గర్వపడుతున్నానని పోస్టులో సమంత రాసుకొచ్చారు.

మిస్టర్ రాహుల్ గాంధీ… అదుపులో పెట్టుకోండి!
ఓ మహిళా మంత్రి రాక్షసిగా మారి… దురుద్దేశంతో కట్టు కథలు అల్లి కల్పిత ఆరోపణలు చేయడం, రాజకీయ యుద్ధం కోసం మంచి మనుషులను పావులుగా వాడుకోవడం విని నేను షాక్ అయ్యానని అక్కినేని అమల సోషల్ మీడియా వేదికగా ఒక లేఖ విడుదల చేశారు. కొండా సురేఖను ఆమె రాక్షసిగా వర్ణించారు. తన భర్త మీద కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సిగ్గు చేటు అని అమలా అక్కినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ”మేడం మినిస్టర్… ఎటువంటి సిగ్గు ఎగ్గు లేకుండా నా భర్త గురించి మంచి మర్యాద లేని వ్యక్తులు చెప్పిన కట్టు కథలను మీరు ఎలా నమ్మారు? ఇది నిజంగా సిగ్గు చేటు” అని అమల ప్రశ్నించారు.
‘మిస్టర్ రాహుల్ గాంధీజీ.. మీరు గనక మానవత్వాన్ని, మర్యాదను విశ్వసించేటట్లు అయితే మీ నాయకులను అదుపులో ఉంచుకోండి. మీ మంత్రితో నా కుటుంబానికి క్షమాపణ చెప్పించండి. ఈ దేశ పౌరులను రక్షించండి” అని అక్కినేని అమల తన లేఖను ముగించారు.

విడాకులు మా వ్యక్తిగతం: సమంత
‘ఒక మహిళగా ఉండడం… అందులోనూ ఇంటి నుంచి బయటకు వచ్చి పని చేయడం… గ్లామర్ ప్రపంచంలో మనుగడ సాగించడం… ప్రేమలో పడటం… ఆ ప్రేమ నుంచి బయట పడటం… ఆ తరువాత ధైర్యంగా నిలబడి పోరాడటం… అందుకు చాలా ధైర్యం, బలం కావాలి” అని సమంత పేర్కొన్నారు ‘నా ప్రయాణం పట్ల నేను చాలా గౌరవంగా ఉన్నాను. ఈ ప్రయాణం నన్ను తీర్చిన తీరుపట్ల కూడా గౌరవంగా ఉన్నాను. ఒక మంత్రిగా మీరు మాట్లాడే మాటలకు విలువ ఉంటుందని మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇతరుల వ్యక్తిగత అంశాలు గురించి మీరు మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా, గౌరవంగా వ్యవహరించాలని నేను కోరుకుంటున్నాను” అని సమంత తెలిపారు.విడాకులు తన వ్యక్తిగత విషయమని సమంత స్పష్టం చేశారు. ఆ విషయంపై ఎటువంటి పుకార్లు వ్యాప్తి చేయకుండా ఉండాలని తాను రిక్వెస్ట్ చేస్తున్నానని తెలిపారు. తాము (అక్కినేని నాగచైతన్య, సమంత) విడాకుల విషయాన్ని రహస్యంగా ఉంచడం వెనుక ఎటువంటి తప్పుడు ప్రచారాలకు ఆహ్వానం పలికినట్లు కాదని చాలా సూటిగా చెప్పారు సమంత.

ఏంటి ఈ సిగ్గులేని రాజకీయాలు ?
మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. ఆమె మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ ‘ఏంటి సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్ళు అంటే చిన్న చూపా? జస్ట్ ఆస్కింగ్’ అంటూ సూటిగా ప్రశ్నించారు. దీంతో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. నిన్న మొన్నటిదాకా పవన్ లడ్డూ వివాదంలో కొంత మంది ఆయన తీరును వ్యతిరేకించినప్పటికీ… తాజాగా కొండా సురేఖ విషయంలో ప్రకాష్ రాజ్ వ్యవహరించిన తీరును మెచ్చుకుంటున్నారు. ఏదేమైనా ఈ వివాదంలో నాగ చైతన్య, సమంత విడాకులను మధ్యలోకి లాగడం అనేది కరెక్ట్ కాదంటూ కొండా సురేఖపై విరుచుకుపడుతున్నారు మూవీ లవర్స్.

మా వ్యక్తిగత జీవితాలు మీడియా హెడ్ లైన్స్ కోసం వాడుకుంటారా?
‘జీవితంలో విడాకుల నిర్ణయమనేది అత్యంత బాధాకరమైన, దురదృష్టకర విషయాల్లో ఒకటి. ఎన్నో ఆలోచనల తర్వాత పరస్పర అంగీకారంతోనే నా మాజీ భార్య, నేను విడిపోయాం. ఎంతో పరిణితితో ఆలోచించి మా విభిన్న లక్ష్యాల కోసం ముందుకు సాగడానికి విడాకులు తీసుకున్నాం. మా విడాకులపై గతంలో అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయి. ఇరు కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదం. ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు. సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం దక్కాలి. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల నిర్ణయాలను మీడియా హెడ్ లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు’’ అని నాగచైతన్య పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img