Homeహైదరాబాద్latest NewsHyd : బస్సు డ్రైవర్‌పై రెచ్చిపోయిన మహిళ

Hyd : బస్సు డ్రైవర్‌పై రెచ్చిపోయిన మహిళ

తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మహాలక్ష్మి పథకం అమలు కాకముందు సీట్టు సరిపోక చాలామంది నిలబడే ప్రయాణం చేసేవారు.

ప్రస్తుతం బస్సులో నిలబడటానికి కూడా స్థలం దొరకడం లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అత్యవసర పని మీద బయటికి వెళ్లాల్సి వస్తే బస్సు ప్రయాణం నరకంగా ఉంటోందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ లక్డీకపూల్ లో ఓ మహిళ సిటీబస్సు ఎక్కడానికి ప్రయత్నించగా డ్రైవర్ అడ్డుకున్నాడు.

స్థలం లేదు, వేరే బస్సు ఎక్కాల్సిందిగా సూచించగా మహిళ కోపంతో ఊగిపోయింది.

నన్ను బస్సు ఎలా ఎక్కనివ్వవో చూస్తానంటూ ఆ డ్రైవర్‌పై ఆగ్రహంతో రెచ్చిపోయి, బస్సుకు అఢ్డంగా నిలబడింది.

వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇది చూసిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అధికారులు స్పందించి బస్సు సర్వీసులను పెంచాలని కోరుతున్నారు.

ఎండవేడిమి దృష్ట్యా మద్యాహ్న సమయంలో బస్సు సర్వీసులను ఆర్టీసీ తగ్గించిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img