సత్యసాయి జిల్లాలో విషాదం
A young man died while dancing at Ganesh Mandapam: ఇదేనిజం, ఏపీబ్యూరో: గణేశ్ మండపం ఎదుట డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరంలో చోటు చేసుకున్నది.
ధర్మవరం పట్టణంలోని మారుతి నగర్‌లో ఓ గణేశ్ మండపం ఎదుట గణేశ్ అనే యువకుడు డ్యాన్స్ చేస్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో ప్రసాద్‌ను స్థానికులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే యువకుడు మృతి చెందినట్లు తెలిపారు.