కండక్టర్ చిల్లర ఇవ్వలేదని యువకుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. బస్సులో టికెట్ తీసుకున్నాక కండక్టర్ చిల్లర ఇవ్వలేదంటూ బెంగళూరులో నితిన్ కృష్ణా అనే యువకుడు సోషల్ మీడియాకెక్కడం వైరల్‌గా మారింది. ఈ విషయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ‘ఎక్స్’ ద్వారా పంచుకున్నాడు. తాను ప్రయాణించిన బీఎంటీసీ బస్సు టికెట్‌ను తన పోస్ట్‌లో షేర్ చేశాడు. “కండక్టర్ దగ్గర చిల్లర లేకపోవడం వల్ల టికెట్ చార్జీపై నేను నా రూ.5ను కోల్పోయా. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా” అని ప్రశ్నించాడు.