Homeహైదరాబాద్latest Newsమూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు.. ​Viral News

మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు.. ​Viral News

Food Delivery Boy గా పనిచేస్తూ 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాడు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన బల్వంత్ రావు అనే యువకుడు హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ.. TGT, PGT, JL ఉద్యోగాలకు ఎంపికయ్యి సత్తాచాటాడు. పట్టుదలతో ముందడుగు వేస్తే, సాధించలేనిది ఏది లేదని బల్వంత్ రావు మరోసారి నిరూపించాడు. ఆశయ సాధనకు పేదరికం అడ్డు కాదని, తనకు తోచిన పనితో ఈ సిమెటు భూతల మహానగరంలో జీవనం కొనసాగిస్తూ, సక్సెస్ ను అందుకున్నాడు ఈ యువకుడు. మాములుగా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం రావడమే గొప్ప అనుకునే ఈ రోజుల్లో, బల్వంత్ రావు ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం, బల్వంత్ రావు కుటుంబ సభ్యులకే కాకుండా, తమ గ్రామ ప్రజలకు కూడా ఎంతో సంతోషాన్నిచ్చింది. సహనం, ఓర్పుతో కూడిన టాలెంట్, ఏ నాటికైనా గమ్యాన్ని చేరుతుందని ఫుడ్ డెలివరీ బాయ్ తాజా ఎగ్జామ్పుల్ సెట్ చేసాడు. బల్వంత్ రావు విజయం పట్ల, తమ కుటుంబీకులు బల్వంత్ కష్టాలను తలచుకుంటూ ఆనంద భాష్పాలు కార్చారు. ఇలాంటి యువత సాధించే విజయాలు, తమ తోటివారికి, తదుపరి తరాలకు స్ఫూర్తినిస్తాయంటూ, బల్వంత్ సక్సెస్ ను కామెంట్స్ రూపంలో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు సోషల్ మీడియా ఔత్సాహికులు.

Recent

- Advertisment -spot_img