Homeఅంతర్జాతీయంA young woman shed tears కంటతడి పెట్టిస్తున్న యువతి

A young woman shed tears కంటతడి పెట్టిస్తున్న యువతి

డ్యాన్స్ ఫెస్టివల్‌లో పాల్గొన్న అర్గమణి (25) అనే యువతిని హమాస్‌ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. బైక్‌పై తీసుకెళ్తున్న సమయంలో అర్గమణి.. మిలిటెంట్లను బతిమాలుతోంది. ‘ప్లీజ్‌..నన్ను చంపకండి! దయచేసి విడిచిపెట్టండి’ అంటూ ఏడుస్తోంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ నాథన్‌ను కూడా హమాస్ దళాలు బంధించి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతోంది. అదే సమయంలో తన సోదరుడు కనబడటం లేదని మోషే ఓర్‌ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బయటకువచ్చిన ఈ వీడియో ఆధారంగా సోథన్‌ను కూడా కిడ్నాప్‌ చేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఇదే కాకుండా.. హ‌మాస్ దళాలు ఓ జ‌ర్మ‌న్ మహిళ‌ను న‌గ్నంగా ఇజ్రాయెల్ వీధుల్లో ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. అయితే ఈ వీడియోలోని ఆ యువతి ఇజ్రాయెల్‌కి చెందిన మహిళా సైనికురాలిగా గుర్తించారు. వీటితో పాటూ.. పెద్ద సంఖ్యలో ప్రజల మృతదేహాలు రహదారిపై పడిఉన్న వీడియోలు కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

Recent

- Advertisment -spot_img