ఇదేనిజం, సిరిసిల్ల : ఓ తండ్రి తన కూతురిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆమె అడిగింది కాదనకుండా ఇచ్చి పెంచి పెద్ద చేశాడు. ఇప్పుడు తన తండ్రికి ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఆ తండ్రి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చేసిన పని సర్వత్రా చర్చనీయాంశమై నెట్టింట వైరల్గా మారింది. ఏం జరిగిందంటే.. ప్రేమ పెళ్లి ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ తండ్రి తన కూతురికి శ్రద్ధాంజలి ఘటిస్తూ పోస్టర్లు విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో వాటిని పోస్ట్ చేసి బంధుమిత్రులందరికీ తన కూతురు చనిపోయిందని పిండ ప్రదానాలు చేశాడు. ఈ షాకింగ్ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఫోటో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైరల్ గా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిలువేరి అనూష అనే యువతి ఇటివలే ఒక అబ్బాయిని ప్రేమించి ఇంటి నుంచి వెళ్ళిపోయి వివాహం చేసుకుంది. ఇలా కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న బాధను జీర్ణించుకోలేక తండ్రి ఈ దురాగతానికి పాల్పడ్డాడు