AA22 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ‘AA22’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మరియు టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాలో హీరో, విలన్, సైన్స్ ఫిక్షన్ క్యారెక్టర్ లో అల్లుఅర్జున్ కనిపించనున్నారు. ఈ మూడు పాత్రల కోసం అల్లు అర్జున్ తన ఫిట్‌నెస్, స్టైలింగ్, మరియు లుక్‌లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై దాదాపు 800 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. డిసెంబర్ 2025 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా 2027 పొంగల్ సందర్భంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.
అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘AA22’ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించే అవకాశం ఉంది. అల్లు అర్జున ట్రిపుల్ రోల్, సైన్స్ ఫిక్షన్ జోనర్, హాలీవుడ్ – స్థాయి VFX వీటితో ఈ సినిమా అభిమానులకు ఒక విజువల్ ట్రీట్‌గా నిలిచే అవకాశం ఉంది. ‘పుష్ప’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్, ఈ సినిమాతో తన స్టార్‌డమ్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లనున్నాడు.