UIDAI తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఉచితంగా ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తోంది. పాత ఆధార్ కార్డులను పూర్తిగా ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేయడానికి రేపటితో (సెప్టెంబర్ 14) ఈ అవకాశం ముగియనుంది. సెప్టెంబర్ 14 తర్వాత ఆధార్ కార్డులో మీరు ఎలాంటి అప్‌డేట్‌కైనా రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.