Homeజిల్లా వార్తలుఆధార్ కేంద్రం లేక అవస్థలు

ఆధార్ కేంద్రం లేక అవస్థలు

– వెంటనే ఏర్పాటు చేయాలని ప్రజల వేడుకోలు

ఇదేనిజం, ఆత్మకూరు : ఆత్మకూరు మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఆధార్ సెంటర్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పిల్లలను పాఠశాల్లో చేర్పించాలన్నా, ఇతర ధ్రువీకరణ పత్రాలు పొందాలన్న, ప్రభుత్వం నుంచి పథకాలు పొందాలన్న, ఆధార్ అవసరం తప్పనిసరిగా మారింది. ఇలాంటి పరిస్థితులల్లో మండలం కేంద్రం ఆధార్ నమోదు కేంద్రం లేకపోవడంతో ఆధార్ అప్డేట్, కొత్తగా వివాహం చేసుకున్న వారు చిరునామా మార్చుకోవాలన్న ప్రత్యేకంగా వేరే ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేస్తే అందరికి అందుబాటులో ఉంటుదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మండలం కేంద్రం ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు

Recent

- Advertisment -spot_img