Aadhaar: భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి ఆధార్ అనేది తప్పనిసరి. ప్రభుత్వ పథకాలు కావాలన్నా, ఏ పని చేసుకోవాలన్నా ఆధార్‌ను అడుగుతుంటారు. అయితే ఆధార్‌లో మన ఫోటో చూడడానికి అసలు బాగుండదు. ఎందుకంటే.. మన దగ్గర ఉండే ఆధార్‌ను ప్రభుత్వ ఆఫీసుల్లో క్రియేట్ చేస్తారు. అయితే వారు వాడే కెమెరా క్వాలిటీ అస్సలే బాగుండదట. అంతేకాదు ఫోటో తీసుకునే ఆఫీసులలో లైటింగ్ సరిగా ఉండకపోవడం, వారు ఏదో తీసామా అంటే తీసాము అనేలా తీయడం కారణాలని చెప్పొచ్చు.