HomeసినిమాAamir Khan : కశ్మీర్ ఫైల్స్ భారతీయులు అందరూ చూడాలి

Aamir Khan : కశ్మీర్ ఫైల్స్ భారతీయులు అందరూ చూడాలి

Aamir Khan : కశ్మీర్ ఫైల్స్ భారతీయులు అందరూ చూడాలి

Aamir Khan : కశ్మీర్ ఫైల్స్ సినిమాకు రోజురోజుకీ మద్దతు పెరుగుతోంది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ సైతం ఈ సినిమాకు మద్దతు పలికారు.

ప్రతి భారతీయుడూ కశ్మీర్ ఫైల్స్ ను చూడాలని తాజాగా పిలుపునిచ్చారు.

ఈ సినిమా ఈ నెల 11న విడుదల కాగా, నాటి నుంచి ప్రతి రోజూ బాక్సాఫీసు కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తూ వెళుతోంది.

Daily Commodities : దేశంలో పెర‌గ‌నున్న నిత్యావసరాల ధరలు

1990లలో కశ్మీర్ లో పండిట్లపై జరిగిన దారుణలను ఈ సినిమాలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కళ్లకుకట్టినట్టు చూపించారు.

బాలీవుడ్ కమ్యూనిటికీ చెందిన పలువురు ఇప్పటికే ఈ సినిమాకు అనుకూలంగా స్పందించడం గమనార్హం.

వీరికి తాజాగా ఆమిర్ ఖాన్ జత కలిశారు.

Krithi Shetty : బాలీవుడ్ లో బంపరాఫర్ కొట్టేసిన కృతి శెట్టి

Mukesh Ambani : మరో దిగ్గజ సంస్థను కొనేసిన‌ ముఖేశ్ అంబానీ

ఢిల్లీలో ఆర్ఆర్ఆర్ సినిమా ఈవెంట్ సందర్భంగా కశ్మీర్ ఫైల్స్ సినిమాపై స్పందన అడగ్గా.. ‘‘నిజమే, నేను తప్పకుండా ఈ సినిమాను చూస్తాను.

ఈ సినిమా కథ చరిత్రలో భాగం.

కశ్మీరీ పండిట్ల విషయంలో జరిగింది నిజంగా విచారకరం.

అటువంటి అంశంతో కూడిన ఏ సినిమాను అయినా భారతీయులు అందరూ చూడాలి.

Barley Water : బార్లీ నీరు.. రోజూ తాగితే బోలెడు లాభాలు

మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరి భావోద్వేగాలను ఈ సినిమా కదిలించింది.

ఈ సినిమాలో ఉన్న అందమైన అంశం అదే.

నేను తప్పకుండా ఈ సినిమాను వీక్షిస్తా.

ఈ సినిమా విజయం సాధించినందుకు హ్యాపీగా వుంది’’ అని ఆమిర్ తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తీకరించారు.

Smart Phone : కొత్త‌ మొబైల్ కొనేటప్పుడు పాటించాల్సిన‌ ఏడు విషయాలు

Rakesh jhunjhunwala : ఒకే రోజులో రూ. 861 కోట్లు సంపద‌

Recent

- Advertisment -spot_img