Homeహైదరాబాద్latest Newsజగిత్యాల సిద్ధార్థ విద్యాసంస్థల ఆధ్వర్యంలో రవీంద్ర ప్లే స్కూల్ లో ఘనంగా నిర్వహించిన ఆషాడ మాస...

జగిత్యాల సిద్ధార్థ విద్యాసంస్థల ఆధ్వర్యంలో రవీంద్ర ప్లే స్కూల్ లో ఘనంగా నిర్వహించిన ఆషాడ మాస బోనాలు

ఇదేనిజం, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని సిద్ధార్థ విద్యా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక రవీంద్ర ప్లే స్కూల్లో లో ఘనంగా ఆషాడ మాసం బోనాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నుండి విద్యార్థులు, బోనాలతో ర్యాలీగా స్థానిక గాజుల పోచమ్మ వరకు వెళ్లి పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు మరియు పోతురాజు వేషాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎల్లవేళలా చేస్తుంటామని పాఠశాల నిర్వాహకులు సుమన్ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ విద్యా సంస్థల డైరెక్టర్స్ బి. శ్రీధర్ రావు, బి. హరిచరణ్ రావు, బి. రజిత , బి. అజిత, జే. మౌనిక, కె. కిషన్, జే. రాజు లతోపాటు గాజుల పోచమ్మ ఆలయ చైర్మన్ గాజుల రాజేందర్ గారు మరియు ఉపాధ్యాయులు పోషకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Recent

- Advertisment -spot_img