విజయ్ హజారే ట్రోఫీలో యువ ఆటగాడు అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. పంజాబ్ – సౌరాష్ట్రల మధ్య జరిగిన మ్యాచులో కేవలం 60 బంతుల్లోనే శతకం బాదాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో అభిషేక్ 170(96) పరుగులు చేశాడు. మరో ఆటగాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్ 125(95) రన్స్ చేశాడు. పంజాబ్ టీమ్ 50 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 424 పరుగుల భారీ స్కోరు చేసింది.