Homeహైదరాబాద్latest Newsచెడు అలవాట్లకు దూరంగా ఉంటూ.. క్రమశిక్షణ తో విధులు నిర్వహించండి: జీ.ఎం.ఏ.పీ.ఏ

చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ.. క్రమశిక్షణ తో విధులు నిర్వహించండి: జీ.ఎం.ఏ.పీ.ఏ

ఇదే నిజం, రామగిరి: చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఏ.పీ.ఏ. జీ.ఎం. కే.వెంకటేశ్వర్లు అన్నారు.సింగరేణిలో విధులు నిర్వహిస్తూ వివిధ అనారోగ్య కారణాల వల్ల మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన, మృతి చెందిన ఉద్యోగుల డిపెండెంట్ లకు కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులను ఇటీవల జారీ చేయడం జరిగినది.అందులో 88 మంది అభ్యర్థులకు స్థానిక ఎం.వి.టి.సి. లో శిక్షణ కొరకు ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా బుధవారం ఎం.వి.టి.సి నందు నిర్వహించిన కార్యక్రమంలో వారిని ఉద్దేశించి ఏ.పీ.ఏ. జీ.ఎం.కే.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సింగరేణి సంస్థ లో ఉద్యోగం రావడం అదృష్టమని, సంస్థ ఇచ్చేటువంటి శిక్షణ ను సద్వినియోగం చేసుకొని,ఉద్యోగంలో చేరిన తరువాత క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాలని అన్నారు. అంతేకాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా విధి నిర్వహణలో ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ భద్రత తో విధులు నిర్వహించాలని,ఎం.వి.టీ.సి శిక్షణ పూర్తయిన వెంటనే ఇచ్చిన గడువులోపు విధులలో చేరాలని అన్నారు.

సింగరేణి సంస్థ లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించడానికి ప్రస్తుతం చాలా అవకాశాలు ఉన్నందున,దీనిని సద్వినియోగం చేసుకొని పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు.సింగరేణి సంస్థ ఉద్యోగుల కోసమే కాకుండా వారి కుటుంబసభ్యుల కోసం కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు.కావున ప్రతి ఉద్యోగి సింగరేణి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. అనంతరం ఎంవిటిసి ఆవరణ లో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటుజీఎం బి.సత్యనారాయణ, ఎం.వి.టి.సి.మేనేజర్ మల్లన్న, డి.వై.ఎస్.ఇ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img