విశాఖ-లింగంపల్లి జన్మభూమి సూపర్‌ఫాస్ట్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నంలో ఉదయం 6.20 గంటలకు బయల్దేరిన 2 నిమిషాలకే ఏసీ బోగీ లింక్ తెగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది.. రైలును విశాఖలోనే నిలిపివేశారు. సాంకేతిక సమస్యతో 2 బోగీలు రైలు నుంచి విడిపోయాయని అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరించాక రైలును పంపనున్నట్లు వెల్లడించారు.