తెలంగాణ ఇంటర్ బోర్డు మరో కీలక ప్రకటన చేసింది. వచ్చే అకడమిక్ క్యాలెండర్ (2025-26)లో ఇంటర్ కళాశాలల్లో మొత్తం 226 రోజులు తరగతులు జరుగుతాయని తెలిపింది. కొత్త విద్యా సంవత్సరం జూన్ 2 నుండి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ఉంటాయని తెలిపింది. జనవరి 11 నుండి 18 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రాక్టికల్స్, మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షలు జరుగుతాయి.