– పిటిషన్‌ను తిరస్కరించిన ఏపీ ఏసీబీ కోర్టు
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు లీగల్ ములాఖత్‌లను పెంచాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ప్రతివాదుల పేర్లు చేర్చనందున ఇప్పుడు విచారణ అవసరం లేదని న్యాయాధికారి తెలిపారు. రోజుకు ఒకసారి మాత్రమే చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్‌కు కోర్టు అనుమతించింది. న్యాయవాదులకు ఇచ్చే రోజుకు రెండు ములాఖత్‌లను జైలు అధికారులు ఒకటికి కుదించారరని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో కేసులు విచారణ జరుగుతున్న నేపథ్యంలో రోజుకు మూడు ములాఖత్‌లు ఇప్పించాలని కోరారు. కనీసం 45-50 నిమిషాలు చర్చించేందుకు అవకాశం ఇచ్చేలా జైలు అధికారులను ఆదేశించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.