ACB Raid: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల తహశీల్దార్ జాహ్నవి రెడ్డి రూ.30వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఎసీబీకి చిక్కారు. మండల పరిధిలోని పరిటాలకు చెందిన రైతు మాగంటి కోటేశ్వరరావు భూమి పట్టా సరిచేయడం కోసం తహశీల్దార్ రూ.లక్ష డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రైతు తహశీల్దార్ కార్యాలయంలో రూ.30వేలు ఇస్తుండగా అధికారులు డైరెక్ట్‌గా పట్టుకున్నారు. ఇందులో భాగమైన VRO రామారావును కూడా అధికారులు పట్టుకున్నారు.