Homeఫ్లాష్ ఫ్లాష్మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డిపై ఏసీబీ దాడులు

మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డిపై ఏసీబీ దాడులు

హైదరాబాద్​: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజిగిరి ఏసిపి నరసింహారెడ్డిపై ఏసీబీ దాడులు చేస్తోంది. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్ లోని ఆయన ఇంటితోపాటు డిడి కాలనీ, ఉప్పల్ ఏసీపీ కార్యాలయం, అంబర్ పేట్లలో సోదాలు కొనసాగుతున్నాయి. వరంగల్, కరీంనగర్, నల్లగొండ, అనంతపూర్​లలో నర్సింహారెడ్డి బంధువుల ఇండ్లలోనూ ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. మొత్తం 34 చోట్ల సోదాలు జరుగుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
2008 నుండి 2010 వరకు మియాపూర్ సీఐగా పనిచేసిన నరసింహారెడ్డి పనిచేసే సమయంలో పలు ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ వివాదాలు సెటిల్ చేసి బాగా వెనుకేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉప్పల్ సీఐగా పనిచేసిన సమయంలోనూ పలు ల్యాండ్​ వివాదాల్లో తలదూర్చినట్లు తెలుస్తోంది.
మియాపూర్ హఫీజ్ పేట్ లోని మంజీరా రోడ్డు వినాయక నగర్ లో మూడంతస్తుల భవనం బచ్ పన్ స్కూల్ కీ అద్దెకు ఇచ్చినట్లు గుర్తించారు. అలాగే హైటెక్ సిటీ లో సైబర్ టవర్ ఎదురుగా 2 వేల గజాల స్థలం కూడా ఉన్నట్లు దానికి సంబంధించిన రికార్డులు ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img