దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. బోట్స్‌వానా నుంచి మోరియా వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి అదుపు తప్పి లోయలో పండింది. ఈ ఘటనలో 45 మంది మృతిచెందగా, 8 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈస్టర్ పండుగ కోసం జియాన్ చర్చికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 165 అడుగుల లోతులో బస్సు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కొన్ని మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు.