అనంతపురం – కడప హైవేపై నార్పల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు వేగంగా ఢీకొట్టడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను అనంతపురం ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన భక్తులుగా గుర్తించారు పోలీసులు. తాడిపత్రిలో నగర కీర్తన వేడుకలో పాల్గొని వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది. లారీ కిందకు వెళ్లి కారు నుజ్జునుజ్జయింది.