షాద్నగర్ పరిధిలోని నందిగామ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాయణగుట్టకు చెందిన హాజీరా బేగం(35), అబ్దుల్ రహ్మాన్ (12), మరో కొడుకు ముగ్గురు కలిసి స్కూటీపై షాద్నగర్కు బయలుదేరారు. ఈ క్రమంలో వారు నందిగామకు వద్దకు రాగానే స్కూటీని ఎదురుగా వచ్చిన RTC బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హాజీరా బేగం, అబ్దుల్ రహ్మాన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో బాలుడికి గాయాలయ్యాయి.