Homeహైదరాబాద్latest Newsవాస్తు ప్రకారం దిండు కింద వీటిని పెట్టుకుని నిద్రపోతే మీరు కోరుకున్న ఫలితాలను పొందుతారట.. అవి...

వాస్తు ప్రకారం దిండు కింద వీటిని పెట్టుకుని నిద్రపోతే మీరు కోరుకున్న ఫలితాలను పొందుతారట.. అవి ఏంటంటే?

వాస్తు ప్రకారం, జీవితంలో మీరు కోరుకున్న ఫలితాలను పొందడానికి, చెడు, భయానక కలలకు దూరంగా ఉండడానికి కొన్ని వస్తువులను దిండు కింద ఉంచడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది జీవితంలో నెగిటివిటీని తొలగిస్తుందని నమ్ముతారు. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
లవంగాలు:
మీరు రోజూ దిండు కింద 5,7 లేదా 9 లవంగాలను పెట్టి నిద్రపోవచ్చు. ఇలా చేయడం వల్ల సానుకూల శక్తి కలిగి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
బిర్యాని ఆకులు:
వాస్తు శాస్త్రంలో, బిర్యాని ఆకులను దిండు కింద ఉంచడం ఆనందం, శ్రేయస్సుకు కారకంగా పరిగణించబడుతుంది. దిండు కింద ఈ ఆకులను పెట్టి పడుకోవడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుందని నమ్ముతారు.
పటిక:
వాస్తులో, దుష్ట శక్తులు మరియు భయానక కలల నుండి రక్షణ కోసం పటికను దిండు కింద ఉంచడం ప్రయోజనకరంగా భావిస్తారు. పటిక ముక్కను కనీసం 7 రోజులు దిండు కింద ఉంచడం వల్ల పీడకలలతో సహా ప్రతికూలత తొలగిపోతుందని నమ్ముతారు. ఆ తరవాత ఇంటి నుంచి తీసేయండి.
తులసి ఆకు:
హిందూమతంలో తులసి ఆకును పూజలో ఉపయోగిస్తారు. ఇవే కాకుండా తులసిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. నిద్రపోయేటప్పుడు తులసి ఆకును దిండు కింద ఉంచడం వల్ల జీవితంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. అయితే సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకును తొలగించద్దు.

Recent

- Advertisment -spot_img