హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం ఆచార్యపై ఆదిలోనే వివాదాలు ముసురుతున్నాయి. ఆచార్య చిత్ర కథపై రచయితలు తమదంటే తమదని వాదించుకుంటున్నారు. ఆచార్య చిత్ర కథ తాను 2006లో రైటర్స్ అసోసియేషన్‌లో ‘పుణ్యభూమి’ అనే టైటిల్‌తో రిజిస్టర్ చేసుకున్నదేనని రచయిత కన్నెగంటి అనిల్ కృష్ణ ఆరోపించారు. దీనికంటే ముందు మరో రచయిత మండూరి రాజేశ్ సైతం ఆచార్య కథ తనదేనంటూ మీడియా ముందు ఆరోపించిన సంగతి తెలిసిందే. కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదల చేశారు. ప్రస్తుతం షూటింగ్ చేసుకుంటున్న ఆచార్య చిత్ర కథపై ఇలా వివాదం రావడం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయంగా మారింది.