హైదరాబాద్: వనస్థలిపురం ఏసీపీ జయరామ్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. పలు భూవివాదాల్లో జోక్యం చేసుకున్నాడని వనస్థలిపురం ఎసిపి జయరామ్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో విచారణ జరిపించిన ఉన్నతాధికారులు.. ఏసీపీ జయరామ్‌పై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.