ఇదే నిజం, బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని రహదారులను ఆక్రమించుకొని అక్రమ కట్టడాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంట్రాక్టర్ బస్తీ వాసులు బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ కు వినతిపత్రం అందజేశారు. కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ.. రహదారులను ఆక్రమించుకొని అక్రమ కట్టడాల వలన బస్తీల్లోకి 108 అంబులెన్స్ రాలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పలుచోట్ల మద్యం సేవించి మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అదే విధంగా కాంట్రాక్ట్ బస్సులో పెట్రోలింగ్ జరపాలని కోరారు ఈ కార్యక్రమంలో కొలిపాక శ్రీనివాస్ నిట్టూరి రాములు కాసర్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.