Homeహైదరాబాద్latest Newsఅక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్ కు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి...

అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్ కు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

ఇదే నిజం, ధర్మపురి: జగిత్యాల పట్టణంలోని 4వ వార్డులో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, నియమ నిబంధనల మేరకు జరుగుతున్నాయా లేదా అని తేల్చి అక్రమ నిర్మాణాలు అయితే చర్యలు తీసుకోవాలని గురువారం నాడు జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషకు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్ లో గల దేవిశ్రీ గార్డెన్‌కు సమీపంలోని జగిత్యాల మున్సిపాలిటీలోని వార్డు నెం.4లో మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ పక్కదారి పట్టించి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ నిర్మాణాన్ని అనుమతులు తీసుకున్నారా లేదా అనుమతులు లేకుండా చేశారా అనేది విచారణ జరిపించాలని సూచించారు. ఒక వేళ అనుమతి ఉంటే అనుమతి ప్రకారం నిర్మాణమా, అక్రమ నిర్మాణామా తేల్చి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు.అంతేకాకుండా ఇంత జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ విభాగం ఏం చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఏమైనా అక్రమ నిర్మాణంపై విచారణ చేసి సంబంధిత వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు పంపిన లేఖలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు.

Recent

- Advertisment -spot_img