Homeహైదరాబాద్latest Newsఅక్రమ నిర్మాణాలపై చర్యలేవి..? ఫిర్యాదులు బుట్టలకే పరిమితం..!

అక్రమ నిర్మాణాలపై చర్యలేవి..? ఫిర్యాదులు బుట్టలకే పరిమితం..!

ఇదే నిజం, కుత్బుల్లాపూర్: గాజుల రామారం సర్కిల్-26 పరిధిలోని శిరిడిహిల్స్, సూరారం డివిజన్ లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. గాజుల రామరం సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను అదుపు చేయడంలో టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. నియోజక వర్గం పరిధిలోని జరుగుతున్న అక్రమ నిర్మాణాలను పరిశీలించి టౌన్ ప్లానింగ్ చేయాల్సిన అధికారులు తమ నిర్లక్ష్యాన్ని వీడకపోవడంతో ఏడా పెడా చట్ట విరుద్ధంగా అక్రమ నిర్మాణాలను చేపడుతూ అక్రమాలకు ఆజ్యం పోస్తున్నారు. బిల్డర్స్ తో లాలూచీ పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఎంతైనా కట్టుకోండి మా వాటా మాకు ఇస్తే చాలు అన్న చందంగా ఈ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం.

ఫిర్యాదులు బుట్టలకే పరిమితం.. పరోక్షంగా సహకారం అందిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు
సర్కిల్ పరిధిలోని జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆన్ లైన్ ట్విట్టర్ ఖాతాతో పాటు, మున్సిపల్ కార్యాలయానికి స్వయంగా వెళ్లి వ్రాత పూర్వకంగా ఫిర్యాదులు చేస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోక పోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. మరీ ముఖ్యంగా అధికారులు అక్రమ నిర్మాణదారులతో కలిసి లంచాలు దండుకోవడంతో కేవలం నోటీసులు, ఎస్ టీ ఎఫ్ టీం కు నివేదిక అంటూ చేతులు దులుపుకుంటూ అక్రమార్కులకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువేత్తుతున్నాయి . గాజుల రామారం టౌన్ ప్లానింగ్ అధికారులు ఎస్ టీ ఎఫ్ లోపాయికారీ ఒప్పందాలతో జీహెచ్ఎంసీ కి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img