ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం చెన్నైలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, ప్రకాష్ రాజ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతుంటే.. మరో డిప్యూటీ సీఎం మాత్రం సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. అయితే తాను ఎప్పుడూ బలహీన వర్గాల తరపున మాట్లాడనని,ప్రశ్నిస్తానని చెప్పారు. అయితే తిరుమల లడ్డూ వివాదం మొదలైనప్పటి నుంచి సినీ నటుడు ప్రకాష్ రాజ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.