హైదరాబాద్ లో ప్రముఖ హాస్య నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి (38) గుండెపోటుతో కన్నుమూశారు. నిన్న కార్దియాక్ అరెస్ట్ కావడంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూతురు మృతితో రాజేంద్రప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించారు.