ముంబాయిః ప్రముఖ నటి జెనీలియా డిసౌజ తన కరోనా కష్టాలను తన అభిమానులతో పంచుకున్నారు. 21 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండటం నరకంలా అనిపించిందని అభిప్రాపడ్డారు. ఐసోలేషన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డట్టు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆమే ఇంకా ఏం చెప్పారంటే.. ముడూ వారాల క్రితం కరోనా పాజిటివ్ వచ్చిందని, లక్షణాలు మైల్డ్‌గా ఉన్నాయని చెప్పారు. 21 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉన్న తర్వాత కరోనా నెగిటివ్ రావడం సంతోషంగా ఉందన్నారు. కరోనాతో పోరాటం సులువుగా అనిపించినా ఐసోలేషన్‌లో ఒంటరిగా ఉండటం మాత్రం నరకంగా అనిపించిందన్నారు. తన ఒంటరి తనాన్ని ఏ డిజిటల్ పరికరాలు భర్తీ చేయలేకపోయినట్లు తెలిపారు. ఇన్నాళ్లకు ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసినందుకు సంతోషంగా ఉందన్నారు. కరోనా లక్షణాలు కనిపించగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని, ఫిట్‌గా ఉంటూ మంచి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కరోనాపై పోరాటం చేయగలమని తన అభిమానులకు సలహా ఇచ్చింది.