Homeజాతీయంబీజేపీలోకి నటి పాయల్

బీజేపీలోకి నటి పాయల్

Leading Bengali actress PayalSarkar has taken a kashayapu tirtha. On Thursday, she joined the party in the presence of Kolkata BJP state president DilipGhosh.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు వేడెక్కాయి. అసంతృప్తులు ఒక పార్టీ నుంచి మరొ పార్టీలో జంప్‌ అవుతున్నారు.

ముఖ్యంగా అధికార పార్టీ టీఎంసీ నుంచి ఇప్పటికే పలువురు కీలక నేతలు బీజేపీలో చేరారు.

మరోవైపు ఇరు పార్టీలు పోటాపోటీగా సినీతారలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నాయి. ఇటీవల బెంగాలీ నటుడు యాశ్ దాస్‌గుప్తా బీజేపీలో చేరారు.

తాజాగా ప్రముఖ బెంగాలీ నటి పాయల్‌ సర్కార్‌ కాషాయపు తీర్థం పుచ్చకున్నారు.

గురువారం ఆమె కోల్‌కతా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

కాగా, ఇప్పటికే పలువురు టీఎంపీ నేతలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

అలాగే పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా కాషాయం తీర్థం పుచ్చుకుంటున్నారు. మరోవైపు అధికార టీఎంసీలో కూడా భారిగా చేరికలు జరుగుతున్నాయి.

క్రికెటర్‌ మనోజ్‌ తివారీ, బెంగాల్‌ రాజ్‌ చక్రవర్తి, కంచన్‌ముల్లిక్‌, సయోని ఘోష్‌ ఇటీవల టీఎంసీలో చేరిన విషయం విధితమే.

కాగా, పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించకపోయినప్పటికి బీజేపీ, తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

Recent

- Advertisment -spot_img