Homeసినిమా10 రోజులకే పెటాకులైన పెండ్లి

10 రోజులకే పెటాకులైన పెండ్లి

భర్తపై కేసు పెట్టిన పూనమ్ పాండే
గోవా: హాట్​ బ్యూటీ పూనమ్​ పాండే 10 రోజుల క్రితం సామ్ బోంబేను పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. హానీమూన్​కి గోవాకు పోయారు. అక్కడే పూనమ్​ ఓ సినిమా షూటింగ్​లో పాల్గొంటుంది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ పూనమ్​ తన భర్తపై గోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో సామ్ బోంబేను పోలీసులు అరెస్టు చేశారు. ‘సామ్​ తనను వేధించాడని, హింసించాడని, తనపై దాడి చేశాడని’ సోమవారం అర్ధరాత్రి పూనమ్​ కంప్లైట్​ ఇస్తే అరెస్టు చేసినట్లు కనకోన పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తుకారాం చవన్ వెల్లడించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించామని చెప్పారు. మరోవైపు, పూనమ్‌తో తీసుకున్న అన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి సామ్ బోంబే తొలగించడం వారిద్దరి మధ్య ఏదో తేడా జరిగింది అనడానికి ఊతమిస్తోంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img