హైదరాబాద్: రష్మిక పరిచయం అక్కర్లేని నటి. ‘గీత గోవిందం’తో తెలుగు ఇంట అభిమానులను సంపాదించుకుంది. త్వరలోనే పుష్పలో అల్లు అర్జున్‌తో కలిసి అభిమానులను అలరించనున్నారు. ఆమె తాజాగా సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. #RushHour అనే ట్యాగ్‌తో ప్రశ్నలు అడగమని తన ఫాలోవర్స్‌ను కోరారు. అందులోని ఆసక్తికర ప్రశ్నలకు రష్మిక సమాధానాలు చెప్పింది. ఈ మేరకు తన ట్విటర్లో ఓ వీడియోని పోస్టు చేసింది. అందులో ఫాలోవర్స్ అడిగిన కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి.
ఫాలోవర్స్ కొంటె క్వశ్చన్స్
‘నటి అవ్వాలంటే ఏం కోర్సు చేయాలి?’, ‘స్కూల్, కాలేజీలో జరిగిన ఫన్నీ మూమెంట్?’, ‘ఒత్తిడి తగ్గించుకోవడానికి ఏం చేస్తారు?’, ‘హోటల్ నుంచి ఏదైనా దొంగలించారా?’, ‘పరీక్షల్లో కాపీ కొట్టారా?’, ‘మీరు రెడీ అయ్యేందుకు ఎంత టైం పడుతుంది?’, ‘మీ ఫోన్‌లో బాగా వాడే యాప్స్?’, ‘మీకిష్టమైన స్ట్రీట్ ఫుడ్?’, ‘మీ జుట్టు చాలా బాగుంది. కిటుకులు చెబుతారా?’, ‘మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ప్రక్రియ ఏంటి?’… వీటికి రష్మిక సమాధానాలు ఇచ్చింది.