మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వైసీపీ హయాంలో యాక్టివ్‌గా ఉన్న రోజా ఈరోజుల్లో రాజకీయ వివాదాలపై చాలా అరుదుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు 2024 ఎన్నికల ఫలితం షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు రోజా కూతురు స్టార్ హీరో ఇంటికి కోడలు కాబోతుందనే వార్త వైరల్ గా మారింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ‘‘నా కూతురి పెళ్లి ప్రపోజల్స్‌పై వైరల్‌గా వస్తున్న వార్తల్లో నిజం లేదు.. నా కూతురు చదువుకోవడానికి అమెరికా వెళ్లిందని, అయితే నా కూతురు నటన రంగంలోకి వస్తే చాలా సంతోషంగా ఉంది’’ అని రోజా అన్నారు. సైంటిస్ట్ కావాలన్నదే నా కూతురి లక్ష్యం.. నా కూతురి అభిమతం మేరకు కెరీర్ లైఫ్ సాగుతుంది అని రోజా వ్యాఖ్యానించారు. జబర్దస్త్ షోకి జడ్జిగా రోజా రీఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది కానీ ఆ వార్తల్లో నిజం లేదు అని ఆమె పేర్కొన్నారు.