బెంగాల్ చిత్ర పరిశ్రమలో నటీమణులు ఎదుర్కొంటోన్న లైంగిక వేధింపులపై విచారణ జరిపించాలని సీఎం మమతను బెనర్జీని నటి రితాభరీ చక్రవర్తి కోరారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆమె సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఇక్కడ కూడా జస్టిస్ హేమా కమిటీ వంటి దానిని ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలని అభ్యర్థించారు. లైంగిక వేధింపుల కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవాలని తన పోస్టులో పేర్కొన్నారు.