ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం..111 బిలియన్ డాలర్లతో అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. అంబానీ 109 బిలియన్ డాలర్లతో 12 స్థానంలో కొనసాగుతున్నారు. అదానీ కంపెనీపై అమెరికాలోని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ ఇటీవల సానుకూల రేటింగ్ ఇచ్చింది. దీంతో షేర్లు గరిష్టంగా 14 శాతం వరకు దూసుకెళ్లాయి.