HomeEnglishAdani in Coal Scam: Rahul Gandhi Adani బొగ్గు స్కామ్​ చేస్తున్నరు : Rahul...

Adani in Coal Scam: Rahul Gandhi Adani బొగ్గు స్కామ్​ చేస్తున్నరు : Rahul gandhi

– 12 వేల కోట్ల జనం డబ్బు ఆయన జేబులోకి వెళ్లింది
– కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ ఆరోపణలు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: వ్యాపార‌వేత్త అదానీ బొగ్గు కుంభ‌కోణానికి పాల్ప‌డుతున్న‌ట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అధిక క‌రెంట్ ఛార్జీల‌ను వ‌సూల్ చేస్తున్నార‌ని, ప్ర‌జ‌ల‌కు చెందిన సుమారు 12 వేల కోట్ల డ‌బ్బును అదానీ జేబులోకి మ‌ళ్లించారని రాహుల్ కేంద్ర స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు చేశారు. ఇవాళ న్యూఢిల్లీలో ఆయ‌న మీడియా మాట్లాడుతూ.. ఫైనాన్షియ‌ల్ టైమ్స్ ప్ర‌చురించిన రిపోర్టుపై కామెంట్ చేశారు. అదానీ కోల్ స్కామ్ గురించి భార‌తీయ మీడియా ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. ఇండోనేషియా నుంచి అదానీ బొగ్గును కొనుగోలు చేస్తున్నార‌ని, ఆ బొగ్గు ఇండియాకు వ‌చ్చేలోగా, దాని ధ‌ర రెట్టింపు అవుతోంద‌ని, దీంతో మ‌న క‌రెంట్లు బిల్లులు కూడా పెరుగుత‌న్నాయ‌ని, పేద ప్ర‌జ‌ల నుంచి అదానీ సొమ్ము దోచుకుంటున్నార‌ని, ఫైనాన్షియ‌ల్ టైమ్స్‌లో వ‌చ్చిన క‌థ‌నంతో ఏ ప్ర‌భుత్వమైనా దిగిరావాల్సిందే అని, ప్ర‌జ‌ల నుంచి నేరుగా డ‌బ్బును వ‌సూల్ చేస్తున్న‌ట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img