ఇదే నిజం, నేషనల్ బ్యూరో : గుజరాతీ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రికార్డు సృష్టించారు. హురున్ ఇండియా–2024 వెలువరించిన భారత అత్యంత ధనవంతుల లిస్టులో ఫస్ట్ ప్లేస్ కొట్టేశారు. గతం ఈ స్థానంలో ముఖేశ్ అంబానీ ఉండగా ఈ సారి అంబానీని వెనక్కి నెట్టి అదానీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ ఆస్తుల విలువ రూ.11.61 లక్షల కోట్లుగా హురున్ ఇండియా పేర్కొంది. అదానీ సంపద ఒక్క ఏడాదిలోనే 95 శాతానికి పైగా పెరిగిందని వెల్లడించింది. ఇక రూ.10.14 లక్షల కోట్లతో అంబానీ రెండో స్థానంలో నిలిచారు. దేశంలోని 1,539 మంది వ్యక్తులు రూ.1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నారని ఈ నివేదిక వెల్లడించింది.