Homeహైదరాబాద్latest Newsఆదర్శ పాఠశాల గొల్లపెల్లి విద్యార్థులకు అంతర్జాతీయ బహుమతుల పంట

ఆదర్శ పాఠశాల గొల్లపెల్లి విద్యార్థులకు అంతర్జాతీయ బహుమతుల పంట

ఇదే నిజం, గొల్లపల్లి: రంగోత్సవ్ ఫౌండేషన్‌, ముంబాయి వారు నిర్వహించిన అంతర్జాతీయ పోటీలలో ఆదర్శ పాఠశాల జగిత్యాల జిల్లా గొల్లపల్లి విద్యార్థులు ప్రతిభ చూపారు. పాఠశాల విద్యార్థులు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్, గ్రీటింగ్, కలరింగ్, కొలాజ్, టాటూ,ఫొటోగ్రఫి, తదితర తొమ్మిది రకాల పోటీల్లో పాల్గొనగా జాస్యా బేగం ద్వితీయ బహుమతి పొంది అమేజాన్ అలెక్సా పరికరం, కాస వైశ్విక,తొట్ల మనోజ్ కుమార్లకు బోట్ స్మార్ట్ వాచ్ లు,గ్రీష్మ ,రిషిత,దివ్య,సాహితి లకు అర్ట్ మెరిట్ అవార్డులు , పద్నాలుగు ఇంటర్నేషనల్ మెడల్స్,ఏడు కన్సోలేషన్ బహుమతులు,మెమెంటోలు , సర్టిఫికెట్లు,ఇతర బహుమతులు లభించాయి.

ఉపాధ్యాయులు ,విద్యార్థులు, తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.విద్యార్థులను ప్రోత్సహించినందుకు గాను పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ కు ‘వరల్డ్ పర్ఫార్మెన్స్ అవార్డు’, వైస్ ప్రిన్సిపాల్ కె.నగేష్ కు ‘గ్లోబల్ అవార్డు’ పోటీల జిల్లా కన్వీనర్ వనపర్తి రాజశేఖర్ అందజేసారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపా ల్ ఈరవేణి రాజ్ కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీల్లో తమ విద్యార్థులు బహుమతులు సాధించడం ఆనందంగా వుందని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు సాధించడానికి విద్యార్థులకు ఇది స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.

బహుమతులు సాధించిన విద్యార్థులకు పాఠశాల ఆంగ్లోపాధ్యాయులు జి.వి.రమణ మార్గదర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో రంగోత్సవ్ జిల్లా కన్వీనర్ రాజశేఖర్, పాఠశాల ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ తో పాటుగా, వైస్ ప్రిన్సిపాల్ నగేష్,గైడ్ టీచర్ రమణ, విద్యార్థులను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు అరుణ్ కిరణ్, మురళీధర్,రాకేష్,ప్రవీణ్, రవికుమార్,సంధ్యారాణి, రమాదేవి, హరిప్రియ, అర్చన, అన్నపూర్ణ విద్యార్థులకు బహుమతి ప్రధానం చేసారు.

Recent

- Advertisment -spot_img