ఆన్‌లైన్ గేమ్ లకు బానిసై ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం ముక్తిపాడు గ్రామానికి చెందిన అనిల్ కుమార్ (21) ఆన్‌లైన్ గేమ్ లకు బానిసై అప్పుల పాలైతే.. తన తండ్రి అప్పులన్నీ తీర్చాడు. అయినా తీరు మారని అనిల్ కుమార్ మళ్లీ బ్యాంకుల్లో అప్పులు చేసి, ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టాడు. ఈ సారి అనిల్ తండ్రికి ఏం చెప్పాలో తెలియక పొలంలో పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు.