HomeతెలంగాణAdditional tax on diesel vehicles? డీజిల్ వెహికల్స్ పై 10 శాతం అదనపు...

Additional tax on diesel vehicles? డీజిల్ వెహికల్స్ పై 10 శాతం అదనపు జీఎస్టీ!

Additional tax on diesel vehicles? ఇదే నిజం, నేషనల్ బ్యూరో: డీజిల్ బండ్లు కొనాలనుకునే వారికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ షాక్ ఇచ్చారు. డీజిల్ ఇంజిన్ వెహికల్స్ పై 10 శాతం అదనపు జీఎస్టీ విధించే ప్రతిపాదనను ఈరోజు సాయంత్రం ఆర్థిక మంత్రి ముందు ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన 63వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ యాన్యువల్ కన్వెన్షన్ సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. డీజిల్ వెహికల్స్ కారణంగా పొల్యూషన్ పెరుగుతోందని అందుకే, అదనపు జీఎఎస్టీని పొల్యూషన్ ట్యాక్స్ రూపంలో వసూలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. డీజిల్ బండ్ల తయారీని తగ్గించుకోవాలని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ సూచించారు.

Recent

- Advertisment -spot_img