న్యూఢిల్లీ: ఆధార్ కార్డు అన్ని సేవలకు ముఖ్యమైంది. అందులో ఏమైనా మార్పులు చేయాలంటే సపోర్టు డాక్యుమెంట్స్ కవాల్సిందే. కానీ కొన్ని ఆధార్లో కొన్ని మార్పులు చేసేందుకు అసలు ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదని స్వయంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI వీటిపై ట్విటర్లో క్లారిటీ ఇచ్చింది. ఆధార్ కార్డులో ఫోటో, బయోమెట్రిక్స్, జెండర్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ అప్‌డేట్ చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. మీరు చేయాల్సిందల్లా మీ ఆధార్ కార్డు తీసుకొని మీకు దగ్గర్లోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లడమే.
ఆన్లైన్లో స్లాట్ బుకింగ్
ఆధార్లో వివరాలు అప్‌డేట్ చేయించాలంటే ఆధార్ సేవా కేంద్రంలో పడిగాపులు పడాల్సిన అవసరం లేదు. ఎంచక్కా ఆన్‌లైన్‌లోనే http://appointments.uidai.gov.in/ స్లాట్ బుక్ చేసుకోని కొత్తగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ దగ్గర్నుంచి పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ లాంటివన్నీ అప్‌డేట్ చేసుకోవచ్చు.
డాక్యుమెంట్స్ లేకుండానే ఆధార్ అప్‌డేట్
RELATED ARTICLES