Homeహైదరాబాద్latest NewsAditya 369 : ''ఆదిత్య 369'' మూవీ రిటర్న్స్.. రీ-రిలీజ్ కు రంగం సిద్ధం

Aditya 369 : ”ఆదిత్య 369” మూవీ రిటర్న్స్.. రీ-రిలీజ్ కు రంగం సిద్ధం

Aditya 369 : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఐకానిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా ”ఆదిత్య 369”(Aditya 369). సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1991లో ఘన విజయం సాధించింది. ఈ సినిమా త్వరలో నేటి యువతరం కోసం 4K రిజల్యూషన్‌లో అప్‌గ్రేడ్ 5.1 సౌండ్ క్వాలిటీతో రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సైన్స్ ఫిక్షన్ మరియు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించబడిన తొలి భారతీయ చిత్రంగా ప్రసిద్ధి చెందిన ఆదిత్య 369 సినిమాని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.ఈ సినిమాలో బాలకృష్ణ, మోహిని, అమ్రిష్ పూరి, టిన్ను ఆనంద్, హీరో తరుణ్, శుభలేక సుధాకర్, సిల్క్ స్మిత, తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Recent

- Advertisment -spot_img